మద్య నిషేధానికి తూట్లు పొడిచిందే చంద్రబాబు: ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్

By narsimha lode  |  First Published Mar 14, 2022, 10:56 AM IST

ఏపీ అసెంబ్లీలో  సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని  కోరారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆయన ప్రసంగించారు.


అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న TDP సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి Kodali Nani స్పీకర్ ను కోరారు.

వాయిదా పడిన తర్వాత AP Assembly సోమవారం నాడు ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే ఏపీ మంత్రి అప్పలరాజు ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు Jangareddy Gudem మిస్టరీ మరణాలపై చర్చకు పట్టుబడ్డారు. ఈ సమయంలో ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు.

Latest Videos

మద్యపానం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో NTR తీసుకువచ్చారన్నారు. అయితే మధ్యపాన నిసేధానికి Chandrababu తూట్లు పొడిచారని మంత్రి నాని విమర్శించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లతో మద్యపానాన్ని చంద్రబాబు ప్రోత్సహించారన్నారు.  రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పాలించిన ఘనత చంద్రబాబుదే అని కొడాలి నాని చెప్పారు.ఎన్టీఆర్ మద్యపానం నిషేధిస్తే చంద్రబాబునాయుడు బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్నిఏరులై పారించారన్నారు.జంగారెడ్డి గూడెంలో సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో  బెల్గ్ షాపులను తమ ప్రభుత్వం  నిర్మూలించిందన్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

YCP ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పు బట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పారు. సభ నుండి సస్పెండ్ కావాలని టీడీపీ సభ్యుల ఆరాటంగా కన్పిస్తుందన్నారు. 

 టీడీపీ పాలనలో ఎనీ టైమ్ మద్యం:  రోజా

ఎనీ టైమ్ మందు దొరికేలా చంద్రబాబు  పాలలన సాగిందని  వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి రాష్ట్రంలో మద్యం ఏరులై పారించారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిందో లేదో  కానీ మద్యం మాత్రం ఇచ్చిందన్నారు.  బడి,గుడి అనే తేడా లేకుండా  మద్యం దుకాణాలు తెరిచారని రోజా విమర్శించారు. టీడీపీ హయంలో 40 వేల బెల్ట్ షాపులకు అనుమతిచ్చారన్నారు. మద్యపాన నిషేధం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రోజా చెప్పారు. 

టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలి: మంత్రి బొత్స

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి టీడీపీ సభ్యుల ప్రవర్తన సరిగా లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని  మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.  టీడీపీ నేతల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.  ప్రజా సమస్యలపై చర్చకు టీడీపీ అడ్డుపడుతుందన్నారు.  జంగారెడ్డి గూడెం ఘటనపై స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

 

click me!