ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్లాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రోడ్డు మార్గంలో జగన్ పుట్టపర్తికి వెళ్లారు.
అనంతపురం: ఏపీ సీఎం జగన్ వెళ్లాల్సిన హెలికాప్టర్ లో బుధవారం నాడు సాంకేతిక సమస్య తలెత్తింది. నార్పల నుండి పుట్టపర్తికి హెలికాప్టర్ లో జగన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రోడ్డు మార్గంలో సీఎం జగన్ పుట్టపర్తికి బయలుదేరారు. అనంతపురం జిల్లాలోని నార్పలలో ఇవాళ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
నార్పల నుండి పుట్టపర్తికి జగన్ టూర్ షెడ్యూల్ ఉంది. నార్పల నుండి పుట్టపర్తికి జగన్ హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య నెలకొనడంతో రోడ్డు మార్గంలోనే సీఎం జగన్ పుట్టపర్తికి బయలుదేరారు. గతంలో కూడా సీఎం జగన్ ప్రయాణించిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అమరావతి నుండి ఢిల్లీకి సీఎం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. వెంటనే విమానాన్ని అత్యవసరంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
undefined
ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఈ విమానంలో సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత జగన్ అదే విమానంలో ప్రయాణించారు.