గుడులు, బడులతో సహా... హోల్ సేల్ గా మచిలీపట్నం లూటీకి కుట్రలు : కొల్లు రవీంద్ర ఆందోళన

By Arun Kumar PFirst Published Apr 26, 2023, 3:46 PM IST
Highlights

మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నూతన మాస్టర్ ప్లాన్ పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 

మచిలీపట్నం : మాజీ  మంత్రి, స్థానిక వైసిపి ఎమ్మెల్యే  పేర్ని నాని మచిలీపట్నంను హోల్ సేల్ గా లూటీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రైవేట్ ఆస్తులనే కాదు గుడులు, బడులు సైతం దోచుకునేలా మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ ని తయారు చేసారని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుంది... కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని మచిలీపట్నం వాసులకు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. 

మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) నూతన మాస్టర్ ప్లాన్ పై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గతంలో భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముడా ఏర్పాటు చేసామని... కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని నిర్వీర్యం చేసారని ఆరోపించారు. తాజాగా మచిలీపట్నం మాస్టర్ ప్లాన్  అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తయారీ అంతా లోపభూయిష్టంగా ఉందని... దీని వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని కొల్లు రవీంద్ర ఆందోళన వ్యక్తం చేసారు. 

Latest Videos

Read More ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ
 
నూతన మాస్టర్ ప్లాన్ లో మల్టీ పర్పస్ జోన్లు లేకుండా 90శాతం రెసిడెన్షియల్ జోన్ గా మార్చారని... దీనివల్ల భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.కనీసం తాగునీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తారో కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో చెప్పలేదని అన్నారు. వైసిపి నేతలు ఆస్తులన్నీ కమర్షియల్ జోన్ వుండేలా మాస్టర్ ప్లాన్ తయారుచేసారని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని కనుసన్నల్లోని మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ తయారయ్యిందని రవీంద్ర అన్నారు. 

ఇప్పటికయినా ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని... లోపభూయిష్టంగా ఉన్న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేయాలని కొల్లు రవీంద్ర సూచించారు. మే 9 లోపు అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది... ఈ లోపు ప్రతి ఒక్కరూ స్పందించి అభ్యంతరాలు తెలపాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. 
 

click me!