నెల్లూరులో దారుణం: పెళ్లికి నిరాకరించిందని కావ్యను కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య

By narsimha lodeFirst Published May 9, 2022, 4:27 PM IST
Highlights


నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కావ్య అనే యువతిపై కాల్పులు చోటు చేసుకొన్నాయి. 

నెల్లూరు:  Nellore జిల్లాలోని Podalakuru మండలం Tatiparthలో సోమవారం నాడు కాల్పుల కలకలం చోటు చేసుకొంది. Marriageకి నిరాకరించిందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సురేష్ రెడ్డి కావ్యపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత  సురేష్ రెడ్డి కూడా తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు.  మాలపాటి  సురేష్ రెడ్డి , కావ్య లు చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. వీరిద్దరికి మధ్య దూరపు బంధుత్వం ఉంది. కావ్యను Suresh Reddy కి ఇచ్చి వివాహం చేసుకొనేందుకు కావ్య పేరేంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ విషయమై కావ్య పేరేంట్స్ తో పాటు బంధువులతో సురేష్ రెడ్డి చాలా రోజులుగా ప్రయత్నాలు చేశారు.కానీ Kavya ను సురేష్ రెడ్డికి ఇచ్చేందుకు మాత్రం ఒప్పుకోలేదు.

 ఇదే విషయమై కావ్య పేరేంట్స్ తో ఇటీవల కాలంలో మధ్యవర్తులను పంపారు. కానీ సురేష్ రెడ్డికి కావ్యను ఇవ్వమని తేల్చి చెప్పారు. కావ్యకు సురేష్ రెడ్డికి మద్య వయస్సులో చాలా తేడా ఉందని కావ్య కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారని సమాచారం.మరో వైపు సురేష్ రెడ్డిని వివాహం చేసుకొనేందుకు కావ్య అయిష్టతను వ్యక్తం చేసింది. తన కూతురికి ఇష్టం లేని పెళ్లిని చేయలేమని కూడా మధ్యవర్తులకు కావ్య పేరేంట్స్ కూడా సమాచారం పంపారని సమాచారం. దీంతో అప్పటి నుండి సురేష్ రెడ్డి కావ్య కుటుంబంపై కక్ష పెంచుకొన్నాడు. 

సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా వీరిద్దరూ స్వంత ఊళ్లలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.సురేష్ రెడ్డి, కావ్యలు ఒకే గ్రామానికి చెందినవారు. సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తిత్వం కలవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం కావ్య ఇంటికి తన వెంట తెచ్చుకొన్న తుపాకీతో కావ్యపై దాడికి దిగాడు. తొలి బుల్లెట్ కావ్యకు తగల్లేదు. రెండో బుల్లెట్ మాత్రం కావ్య కంటికి బుల్లెట్ తగిలింది.  దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపుగా ఆమె మరణించింది. 

కావ్యపై దాడి చేసిన తర్వాత  సురేష్ రెడ్డి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కావ్య ఇంటికి సమీపంలోని స్కూల్ భవనంలోపలికి సురేష్ రెడ్డి వెళ్లాడు. అయితే స్థానికులు అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో సురేష్ రెడ్డి వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను కాల్చుకొన్నాడు.. సురేష్ రెడ్డి కూడా తనను తాను కాల్చుకొన్న కొద్దిసేపటికే మరణించినట్టుగా స్థానికులు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  ఈఘటన గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది., గ్రామానికి భారీగా పోలీసులను తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడిది?

మాలపాటి సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా  తీస్తున్నారు. సురేష్ రెడ్డి ఉపయోగించిన తుపాకీలో బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.మరో వైపు కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని సురేష్ రెడ్డి గతంలో కావ్య కుటుంబానికి రాయబారం పంపిన విషయం వాస్తవమేనని సురేష్ తల్లి చెప్పారు. కానీ సురేష్ రెడ్డి ఏ విషయాన్ని తనకు చెప్పలేదన్నారు. ఇవాళ కారులో ఎక్కడికి వెళ్లి వచ్చాడన్నారు.ఇలా చేస్తాడని కూడా అనుకోలేదని చెప్పారు.

గతంలో కూడ ప్రేమించలేదని  యువతులపై దాడులు చేసి హత్యలు చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇటీవలనే ఏపీ రాష్ట్రంలోని గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్యను శశికృష్ణ కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన 2021 ఆగష్టు 15న హత్య చేశాడు.  ఈ ఘటనపై గత మాసంలోనే శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది.

 

 

click me!