త్యాగమంటే పవన్ కి సీఎం పదవిస్తారా, ఇద్దరు సీఎంలుంటారా: చంద్రబాబు, జనసేనానిపై సజ్జల సెటైర్లు

By narsimha lode  |  First Published May 9, 2022, 4:00 PM IST

త్యాగం అంటే చంద్రబాబు సీఎం పదవిని పవన్ కళ్యాణ్ కు ఇస్తారా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.


తాడేపల్లి: వ్యూహాం అంటే సినిమాల్లో రెండు రీళ్లలో నడిపేదా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  జనసేన చీఫ్ Pawan Kalyan ను ప్రశ్నించారు. పోమవారం నాడు ఏపీ ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy మీడియాతో మాట్లాడారు.

ప్రజలంటే ఇంత చులకనా అని ఆయన అడిగారు.పొత్తులు లేకపోవడమే YCP  బలహీనత అని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.జనమంటే చులకనగా చూస్తున్నారని దీన్ని బట్టి అర్ధమౌతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. త్యాగం చేస్తానంటూనే నాయకత్వం వహిస్తానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు సీఎం పదవిని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారా అనే విషయమైనా చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి అడిగారు. ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలుంటారా అని సజ్జల సెటైర్లు వేశారు.  ఒకరు త్యాగాలకు సిద్దమంటే మరొకరు నేనే సీఎం అంటున్నారని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. TDP  జనసేనలు పగటి కలలు కంటూ ఊహా ప్రపంచంలో ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన చేస్తున్న వ్యాఖ్యల విషయమై బీజేపీ నేత సోము వీర్రాజు విబేధిస్తున్నట్టుగా  మాట్లాడుతున్నారన్నారు.జనంతోనే తమకు పొత్తు అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తావించారు.

Latest Videos

undefined

ఇటీవల కాలంలో ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం చూస్తే  ప్రజలను చులకనగా చూస్తున్నారని అర్ధమౌతుందన్నారు. YS Jaganపాలన పట్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విపక్షాల తీరును చూస్తే తేలిందన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని Janasena చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని ఆయన ప్రస్తావించారు. టీడీపీ, జనసేన, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేదా అనే విషయమై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.  కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని అర్ధమౌతుందన్నారు.Chandrababu, పవన్ కళ్యాణ్ ల మధ్య పొత్తు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఏనాడూ అధికారంలోకి రాలేదన్నారు.  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన మేరకు పొత్తులు పెట్టుకొన్నారన్నారు. పొత్తులను వైఎస్ఆర్ వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. కానీ పార్టీ అధిష్టానం నిర్నయానికి రాజవేఖర్ రెడ్డి తలొగ్గారని ఆయన గుర్తు చేసుకొన్నారు.  ఉమ్మడి ేపీ రాష్ట్రంలో టీడీపీ బీజేపీతొ పొత్తు పెట్టుకొని ఆ తర్వాత ఆ పార్టీతొ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. 1998 నుండి  2004 వరకు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత బీజేపీతొ తెదెంపులు చేసుకుందన్నారు. 2014 లో మరోసారి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొందన్నారు. 2009లో మహాకూటమిగా పోటీ చేసి ఓటమి పాలైందని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు మరోసారి పొత్తుల అంశాన్ని తెర మీదికి తీసుకు వచ్చారన్నారు.

click me!