కామ‌వాంఛ తీరిస్తే ఏమి కావాలన్నా ఇస్తా.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినితో ఉపాధ్యాయుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

Published : Feb 14, 2022, 03:37 PM IST
కామ‌వాంఛ తీరిస్తే ఏమి కావాలన్నా ఇస్తా.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినితో ఉపాధ్యాయుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

సారాంశం

చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. బుద్దితప్పి స్కూల్లోనే బాలికతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ లో వెలుగుచూసింది. చదువుల తల్లి నిలయమైన పాఠశాలలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థితో నీచంగా ప్రవర్తించాడు కీచక ఉపాధ్యాయుడు. 

విద్యార్థులను విద్యాబుద్దులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు దుర్మార్గంగా వ్యవహరించాడు. తండ్రి స్థానంలో ఉంది విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

వ్యాయామ విద్య‌తో విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పాల్సిన వ్యాయ‌మ‌ ఉపాధ్యాయుడు.. మాయమాటలతో త‌న పాఠ‌శాల‌లోని విద్యార్థిని శారీర‌కంగా  లొంగదీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. త‌మ లైంగిక వాంఛ తీర్చితే.. ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే విద్యార్థిని గ‌త కొన్ని నెల‌లుగా వేధించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..  అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..  బొమ్మనహాళ్‌ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప‌నిచేస్తున్న వ్యామ‌య ఉపాధ్యాయుడు అదే పాఠ‌శాలలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే కీచ‌క ఉపాధ్యాయుడు విద్యార్థిని వేధించాడు. ఈ త‌రుణంలో గ‌త రెండు రోజు కిత్రం ఆ విద్యార్థిని ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్‌ చేశాడు. 


అయితే.. ఉపాధ్యాయుడి మాట తీరుపై తల్లిదండ్రులు అనుమానం రావ‌డంతో సెల్ ఫోన్ ను ప‌రిశీలించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో విద్యార్థినికి పంపిన ఆడియో మెసేజీలు చూసి షాక్ అయ్యారు. త‌న కూతురుకు పంపిన ఆడియో చాటింగ్ విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  

ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. విష‌యంలో ఉపాధ్యాయుడిపై కేసు రిజిష్ట‌ర్ అయ్యిన‌ట్టు తెలుస్తుంది. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ వ్య‌క్తమ‌వుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?