పరిషత్ ఎన్నికలు.. మీ వల్లే వైసీపీకి ఈ ఫలితాలు: కలెక్టర్లకు సీఎం జగన్ అభినందనలు

Siva Kodati |  
Published : Sep 22, 2021, 06:40 PM ISTUpdated : Sep 22, 2021, 06:42 PM IST
పరిషత్ ఎన్నికలు.. మీ వల్లే వైసీపీకి ఈ ఫలితాలు: కలెక్టర్లకు సీఎం జగన్ అభినందనలు

సారాంశం

లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను జగన్ అభినందించారు. కలెక్టర్ల కృషి వల్లే ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పరిషత్ ఎన్నికల్లో ఈ తరహా ఫలితాలను తాను చూడలేదని జగన్ అన్నారు. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్‌లో ప్రారంభిస్తానని చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఆ ఇళ్లను అమ్ముకోలేరని చెప్పారు. ఈ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టి సారించాలని జగన్ ఆదేశించారు. కలెక్టర్లు, జేసీలు 10 శాతం ఈ క్రాపింగ్‌ను తనిఖీలు చేయాలని సీఎం సూచించారు.

జేడీఏలు, డీడీఏలు 20 శాతం ఈ క్రాపింగ్‌ను తనిఖీలు చేయాలని జగన్ ఆదేశించారు. అగ్రికల్చర్, అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టి సారించాలని జగన్ సూచించారు. ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో ఈ సమావేశాలు జరగాలని సీఎం తెలిపారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. సాగు చేస్తున్న వారందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను జగన్ అభినందించారు. కలెక్టర్ల కృషి వల్లే ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పరిషత్ ఎన్నికల్లో ఈ తరహా ఫలితాలను తాను చూడలేదని జగన్ అన్నారు. 

మరోవైపు కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సంకేతాలిచ్చారు సీఎం వైఎస్ జగన్. విలేజ్, వార్డు సచివాలయాల తనిఖీలు చేయాలని.. నిర్లక్ష్యంగా వున్న వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు కూడా గ్రామ సచివాలయాలను ఎప్పటికప్పుడు సందర్శించాలని ఆయన ఆదేశించారు. ప్రతి నెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్‌రిచ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం జగన్... స్పందన కార్యక్రమంలో తెలిపారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి 4 గ్రామ సచివాలయాలు సందర్శించాలని జగన్ ఆదేశించారు. డిసెంబర్ నుంచి తాను కూడా గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రహస్యంగా విదేశీ పర్యటన ఎందుకు బాబు? | Kurasala Kannababu | Nara Chandrababu Naidu | Asianet Telugu
తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై Bhumana Karunakar Reddy Reaction | Asianet News Telugu