జగనన్న విద్యా దీవెన, ఇంటర్ ఆన్‌లైన్ ఆడ్మిషన్లపై అప్పీల్‌కి: మంత్రి సురేష్

By narsimha lodeFirst Published Sep 7, 2021, 4:56 PM IST
Highlights

జగనన్న విద్యా దీవెన పథకం, ఇంటర్ ఆన్ లైన్ ఆడ్మిషన్లపై అప్పీల్ కు వెళ్తామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యాసంస్థల యాజమాన్యానికి  డబ్బులిస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి  సురేష్ ప్రశ్నించారు. 
 

అమరావతి: జగనన్న విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తామని  ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. మంగళవారం  నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.జగనన్న విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యాసంస్థల యాజమాన్యానికి  డబ్బులిస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి  సురేష్ ప్రశ్నించారు. కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. విద్యార్థులకు  75 శాతం అటెండెన్స్‌ లేకపోతే రెండో విడత ఈ పథకం కింద నిధులు జమ కావన్నారు.  గతంలో ఇంటర్‌ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్‌లైన్‌ విధానం విజయవంతమైందని  మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

click me!