ఎమ్మెల్సీ భరత్ ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం: కుప్పంలో పోలీసుల లాఠీచార్జీ

Published : Aug 25, 2022, 02:43 PM IST
ఎమ్మెల్సీ భరత్ ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం: కుప్పంలో పోలీసుల లాఠీచార్జీ

సారాంశం

వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల పోటా పోటీ ర్యాలీల నేపథ్యంలో కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

కుప్పం:  కుప్పంలో అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్ధ్వంరేణులు ధ్సంవం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ భరత్ ఇంట్లో కి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంంలో రెండో రోజూ పర్యటనను అడ్డుకుంటామని  గురువారం నాడు వైసీపీ ప్రకటించింది. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు కొనసాగింపుగా ఇవాళ కూడా ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో కుప్పంలో  ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి

కుప్పంలో చంద్రబాబు ప్రారంభించడానికి ముందే అన్న క్యాంటీన్ ను  వైసీపీ క్యాడర్ ధ్వంసం చేసింది. టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి దాడికి దిగారు. అయితే ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్సీ భరత్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జీ  టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.  కుప్పంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లెక్సీలను జెండాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల ర్యాలీలతో కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కుప్పంలో రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నాయుడు నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణుల దాడులపై చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో ఈ తరహా రౌడీయిజాన్ని ఏనాడైనా చూశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం