కడపలో అన్నీ స్ధానాలూ టిడిపివేనట...

Published : Jul 13, 2017, 08:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కడపలో అన్నీ స్ధానాలూ టిడిపివేనట...

సారాంశం

పోయిన ఎన్నికల్లో జనసేన, భాజపాలు మద్దతుగా నిలబడినా, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు గుప్పించినా కడప జిల్లాలోని 10 అసెంబ్లీల్లో టిడిపికి వచ్చింది ఒక్కస్ధానం. తర్వాత బద్వేలు, జమ్మలమడుగు ఎంఎల్ఏలను లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి స్ధానిక సంస్ధల ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకోవటానికి చంద్రబాబునాయుడు పడిన అవస్తలు అందరూ చూసిందే.

మంత్రి నారా లోకేష్ సీరియస్ గా మాట్లాడుతున్నారో లేక కామిడీ చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్నీ స్ధానాల్లో టిడిపినే గెలుస్తుందట. జిల్లాలోని మైదుకూరు తదితర ప్రాంతాల్లో నిన్న లోకేష్ పర్యటించారు. ఆ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు లోకేష్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు రుణమాఫీ అందటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసారు. దాంతో లోకేష్ కు ఒక్కసారిగా మండిపోయింది. సరే, వారికి ఏదో సర్దిచెప్పారనుకోండి.

 

అదే సందర్భంలో వైసీపీ గురించి మాట్లాడుతూ, మా ఆస్తులు, జగన్ అవినీతి సంపాదనపై ఇప్పటికే మూడుసార్లు జగన్ కు సవాలు విసిరినా సమాధానం రాలేదంటూ ఎద్దేవా చేసారు.  అభివృద్ధి గురించి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ సర్పంచులు, నేతలు అభివృద్ధికి అడ్డుపడితే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్నీ స్ధానాలను టిడిపినే గెలుస్తుందని ప్రకటించారు. ఆ స్ధాయిలో జిల్లాను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

 

పోయిన ఎన్నికల్లో జనసేన, భాజపాలు మద్దతుగా నిలబడినా, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు గుప్పించినా కడప జిల్లాలోని 10 అసెంబ్లీల్లో టిడిపికి వచ్చింది ఒక్కస్ధానం. తర్వాత బద్వేలు, జమ్మలమడుగు ఎంఎల్ఏలను లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి స్ధానిక సంస్ధల ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకోవటానికి చంద్రబాబునాయుడు పడిన అవస్తలు అందరూ చూసిందే.

 

పోయిన ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు బాగా తేడా ఉంటుంది. పోయిన ఎన్నికల్లో టిడిపికి కలసి వచ్చిన అంశాలేవీ వచ్చే ఎన్నికల్లో కలసిరావు. జనసేన మద్దతు లభించేది అనుమానమే. భాజపా ఒంటిరిగా పోటీ చేయాలని ప్లాన్ వేస్తోంది. దానికితోడు అన్నీ వర్గాల్లోనూ టిడిపిపై వ్యతిరేకత పెరిగిపోతోంది. స్ధూలంగా ఇది టిడిపి పరిస్ధితి రాష్ట్రంలో. జనాల్లో ఏ స్ధాయి వ్యతిరేకత ఉందన్న విషయం నంద్యాల ఉపఎన్నికల్లో గెలవటానికి టిడిపి పడుతున్న అవస్తులను చూస్తుంటే అర్ధమైపోతుంది. ఇటువంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి 10 స్ధానాలనూ గెలుస్తుందని లోకేష్ ప్రకటించటమంటే కామిడీ కాక మరేమిటి?

PREV
click me!

Recommended Stories

నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu
Vijayawada Christmas Eve Celebrations 2025: పాటలు ఎంత బాగా పడుతున్నారో చూడండి | Asianet News Telugu