బ్రేకింగ్ న్యూస్: వైసిపిలోకి టిడిపి నేత..చంద్రబాబుకు షాక్

First Published Mar 30, 2018, 6:32 PM IST
Highlights
జగన్ పాదయాత్ర రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించే సమయానికి ఇతర పార్టీల్లోని కీలక నేతలను వైసిపిలోకి చేర్చుకోవాలని వైసిపి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తోంది.

టిడిపి సీనియర్ నేత యలమంచిలి రవి త్వరలో టిడిపికి రాజీనామా చేయనున్నారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రవి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ పాదయాత్ర రాజధాని జిల్లాలైన గుంటూ
కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించే సమయానికి ఇతర పార్టీల్లోని కీలక నేతలను వైసిపిలోకి చేర్చుకోవాలని వైసిపి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తోంది.

పేరుకే ఇతర పార్టీలపై కన్నేసినా దృష్టి పెట్టింది మాత్రం ప్రధానంగా టిడిపిపైనే అన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొన్ననే జ్యోతుల చంటిబాబు, నిమ్మకాయల రాజరత్నం లాంటి టిడిపి నేతలు వైసిపిలో చేరారు. రవికి వైసిపికి మధ్య చాలాకాలంగా వ్యవహారం నడుస్తున్నా ఫైనల్ అయింది మాత్రం ఇపుడే.

కృష్ణా జిల్లాలోకి జగన్ ప్రవేశించేరోజున అంటే ఏప్రిల్ 10వ తేదీ ప్రాంతంలో రవి వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. రవి వైసిపిలో చేరటమంటే టిడిపికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుతం వైసిపిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన చెప్పుకోదగ్గ నేతలు పెద్దగా లేరు. అటువంటిది మాజీ ఎంఎల్ఏల రవి వైసిపిలో చేరటమంటే వైసిపికి ప్లస్ అనే భావించాలి. గతంలో పిఆర్పి తరపున రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచారు. మరి, వచ్చే ఎన్నికల్లో జగన్ దగ్గర నుండి ఏం హామీ తీసుకున్నారో స్పష్టంగా తెలియటం లేదు.

click me!