సీఎం జగన్ కు వర్ల రామయ్య ట్విట్టర్ టెస్ట్ : ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా...?

By Nagaraju penumalaFirst Published Aug 8, 2019, 12:35 PM IST
Highlights

దొడ్డిదారిన ఉద్యోగాలు, బదిలీలు, ఫోర్జరీలు చేసినట్లు మంత్రి బాలినేని పీఏపై లోకం కోడై కూస్తోంది. కానీ మంత్రి పీఏ మీద ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. కారణం ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా అంటూ వర్లరామయ్య ట్వీట్ చేశారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ టెస్ట్ పెట్టారు టీడీపీ నేత వర్ల రామయ్య. ట్విట్టర్ వేదికగా మంత్రి బాలినేని పిఏ భీమేష్ వ్యవహారాన్ని ఫజిల్ గా పోస్ట్ చేస్తూ ఈ చిక్కుముడి విప్పగలరా అంటూ  ప్రశ్నించారు. 

గత కొంతకాలంగా  ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పీఏ భీమేష్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పేరుతో పీఏ ఎన్నో అవకతకవలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు వర్ల రామయ్య. 

దొడ్డిదారిన ఉద్యోగాలు, బదిలీలు, ఫోర్జరీలు చేసినట్లు మంత్రి బాలినేని పీఏపై లోకం కోడై కూస్తోంది. కానీ మంత్రి పీఏ మీద ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. కారణం ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా అంటూ వర్లరామయ్య ట్వీట్ చేశారు. 

ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోస్టులతో యుద్దానికి దిగుతున్న పరిస్థితి నెలకొంది. విమర్శలు ప్రతివిమర్శలతో సోషల్ మీడియా రాజకీయంగా హీటెక్కుతోంది.

తాజాగా ఆకోవలో వచ్చి చేరారు వర్ల రామయ్య. అధికార పార్టీపైనా, సీఎం జగన్ పైనా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే మంత్రి పీఏ భీమేష్ వ్యవహారం, వర్ల రామయ్య ఆరోపణలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. 

ముఖ్యమంత్రి గారు! మంత్రి బాలినేని గారి PA భీమేష్. మంత్రి గారి పేరుతో ఎన్నో అవకతవకలకు, అవినీతికి పాల్పడి దొడ్డిదారిన ఉద్యోగాలు, బదిలీలు, ఫోర్జరీలుచేసి నట్లు లోకం కోడై కూస్తోంది. మంత్రి గారుPA మీద ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. కారణం? ఈ అవినీతి చిక్కుముడి విప్పగలరా?

— Varla Ramaiah (@VarlaRamaiah)

 

click me!