జగ్గంపేటలో టీడీపీ సర్పంచ్ భర్త కిడ్నాప్

By narsimha lodeFirst Published Jan 31, 2021, 4:53 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త కిడ్నాప్ అయ్యారు. వైసీపీ వర్గీయులే కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
 


కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త కిడ్నాప్ అయ్యారు. వైసీపీ వర్గీయులే కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

జగ్గంపేట నియోజకవర్గంలోని గొల్లలగుంట గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి భార్య పుష్పలతను సర్పంచ్ అభ్యర్ధిగా టీడీపీ నిర్ణయించింది. శ్రీనివాస్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి శ్రీనివాస్ రెడ్డిని అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు. తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారని శ్రీనివాస్ రెడ్డి  ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవద్దని తమను ప్రత్యర్ధులు బెదిరింపులకు గురి చేశారని పుష్పలత ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరింపులకు దిగినవారే కిడ్నాప్ చేసి ఉంటారని పుష్పలత చెప్పారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ, వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 


 

click me!