కరోనా విషయంలో జగన్ సర్కార్ తప్పుడు లెక్కలు... సాక్ష్యాధారాలతో బయటపెడతాం: బోండా ఉమ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jun 29, 2021, 1:53 PM IST
Highlights

కేరళలో రూ.20వేల కోట్లు, ఢిల్లీలో ప్రతి కుటుంబానికి రూ.5వేల ఆర్ధిక సాయం, ఓడిస్సాలో రూ.2,200 కోట్లు, తమిళనాడులో రూ. 4,153 కోట్లు కరోనా ప్యాకేజీకి ఇస్తే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం ఇచ్చింది? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. 

విజయవాడ: సమర్ధవంతమైన ప్రభుత్వాలు ఉన్న చోట కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని... ఏపీలోని అసమర్థ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొవడంలో విఫలమయ్యిందని మాజీ మంత్రి బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్ సర్కార్ కోవిడ్ విషయంలో తప్పుడు లెక్కలు చెబుతుందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి హెచ్చరించారు. 

కోవిడ్ బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సాధన దీక్షలో దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కేరళలో రూ.20వేల కోట్లు, ఢిల్లీలో ప్రతి కుటుంబానికి రూ.5వేల ఆర్ధిక సాయం, ఓడిస్సాలో రూ.2,200 కోట్లు, తమిళనాడులో రూ. 4,153 కోట్లు కరోనా ప్యాకేజీకి ఇస్తే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం ఇచ్చింది? అని ప్రశ్నించారు. 

''లక్షల మంది కరోనా బారిన పడినవారు ఆస్తులను అమ్ముకుంటున్నారు. కరోనా వచ్చిన ప్రతి కుటుంబం దాదాపుగా రూ.10 లక్షల వరకు అప్పుల పాలయ్యారు. కరోనా మొదటి, రెండో వేవ్ లో ఆరోగ్య శ్రీగా ఎంత మందికి సాయం అందించారు? ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి వాస్తవ లెక్కలు భయటకు చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర ఉందా?'' అని ఉమ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

read more  ఏపీకి జగన్ రెడ్డి రూపంలో శని పట్టుకుంది: సాధన దీక్షలో అచ్చెన్నాయుడు

ఇదే సాధన దీక్షలో టిడిపి నాయకులు కూన రవికుమార్ మాట్లాడుతూ... జగన్ రెడ్డిది చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. కరోనా మహమ్మారిని ప్రపంచంలో అతి తేలిగ్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. 

''రాష్ట్రంలో చోటుచేసుకున్న 1, 80, 000 కరోనా మరణాలు జగన చేతగానితనం వల్లే జరిగాయి. దీనిపై జగన్ మోహన్ రెడ్డి ప్రజాద్రోహం కేసు పెట్టాలి. ప్రజలు ఉపాధి కోల్పోతే ఒక్క రూపాయి కరోనా సాయం చేయలేదు'' అన్నారు. 

''చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉంటే రూ. 10 లక్షల ఎక్సగ్రేషియా ప్రజలకు ఇచ్చి ఉండేవారు. విజయనగరంలో ప్రతీ చనిపోయిన కరోనా భాదితుడి కుటుంబం తరపున నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వం పై పోరాడుతా. తమిళనాడు లో రూ. 4253 కోట్ల రూపాయలు ప్రజలకు సాయం అందిచారు. కానీ జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చింది గుండు సున్నా. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజలను నట్టేట ముంచాడు'' అని రవికుమార్ మండిపడ్డారు. 
 

click me!