టీడీపీ సభ్యుల పక్కన కూర్చొని, అంబటికి స్లిప్పులు: హాట్‌ టాపిక్‌గా వంశీ తీరు

Siva Kodati |  
Published : Dec 12, 2019, 05:21 PM IST
టీడీపీ సభ్యుల పక్కన కూర్చొని, అంబటికి స్లిప్పులు: హాట్‌ టాపిక్‌గా వంశీ తీరు

సారాంశం

ఇవాళ ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు కూర్చొనే మొదటి వరుసలో టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్‌తో గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన సభలో ఎక్కడైనా కూర్చోవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జీవో నెం. 2,430-మీడియాపై ఆంక్షలు అన్న అంశంపై చర్చ జరిగింది.

ఇవాళ ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు కూర్చొనే మొదటి వరుసలో టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కొన్ని అంశాలపై వంశీ స్లిప్స్ రాసి పంపించారు. ఇది లైవ్‌లో కనిపించడంతో వైరల్ అయ్యింది. 

Also read:జగన్ సూపర్ ప్లాన్, వంశీకి స్పెషల్ బెర్త్: క్యూ లైన్లో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు

న్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి తటస్థంగా ఉన్నారు. ఏ పార్టీలో చేరకుండా ఆయన న్యూట్రల్ గా ఉండటంతో స్పీకర్ తమ్మినేని సీతారం ప్రత్యేక స్థానం సైతం కేటాయించారు. 

అయితే వంశీ తటస్థంగా ఉండటం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వంశీమోహన్ తటస్థంగా ఉంటూ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతారని తెలుస్తోంది. అవసరమైతే టీడీపీపై దాడికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. 

Also Read:వంశీతో జగన్ స్కెచ్: చంద్రబాబు అలర్ట్, నిలువరించేనా....

అందుకు నిదర్శనమే మంగళవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభోత్సవంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు వంశీ. తాను తన నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిస్తే టీడీపీ తనపై వేటు వేసిందని ఆరోపించారు. 

తాను టీడీపీలో ఉండలేకే పార్టీకి రాజీనామా చేశానని అందువల్ల తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అలాగే సీటు కూడా కేటాయించాలని కోరిన సంగతి తెలిసిందే. అందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సీటు సైతం కేటాయించేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్