అసెంబ్లీలో టీడీపీ దూకుడు: స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు

By Nagaraju penumalaFirst Published Jul 22, 2019, 4:01 PM IST
Highlights

వియ్ వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపింది. బీసీ, ఎస్సీలకు న్యాయం జరుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతుందంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని ఇది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాల్లో టీడీపీ మరింత దూకుడు పెంచింది. కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ తమ నిరసన వ్యక్తం చేసింది. ప్రతిపక్షంలో వచ్చిన తొలిసారిగా టీడీపీ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. 

నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషణ్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ వైసీపీ బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ ఆందోళనకు దిగింది. 

వియ్ వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపింది. బీసీ, ఎస్సీలకు న్యాయం జరుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతుందంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని ఇది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే ఎక్కడా ఉండబోరని విమర్శించారు. సభలో గందరగోళం చేయడానికి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. 

click me!