మోడీ పర్యటనకు నిరసనగా గుంటూరులో టీడీపీ నిరసన

By rajesh yFirst Published Feb 10, 2019, 10:01 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఆందోళన నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు సూచించింది. దీనిలో భాగంగా గుంటూరు జిన్నా టవర్ సెంటర్‌ వద్ద నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించడంతో పాటు టైర్లు తగులబెట్టి తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు. 

ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఆందోళన నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు సూచించింది.

దీనిలో భాగంగా గుంటూరు జిన్నా టవర్ సెంటర్‌ వద్ద నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించడంతో పాటు టైర్లు తగులబెట్టి తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు. మరోవైపు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, యువనేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. 

ప్రధాని షెడ్యూల్ ఇదే: ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 10.45 గంటలకు మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ప్రధానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ప్రోటోకాల్ అధికారులు, బీజేపీ నేతలు స్వాగతం పలుకుతారు.

అనంతరం వాయుసేన హెలికాఫ్టర్‌లో ఆయన ఉదయం 11.10కి గుంటూరు చేరుకుటారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన మూడు ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. అనంతరం బీజేపీ ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు ప్రధాని ఢిల్లీ తిరిగి వెళతారు. 

click me!