మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత మాట ఇదీ...

Published : Feb 10, 2019, 08:33 AM IST
మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత మాట ఇదీ...

సారాంశం

ప్రిన్స్  మహేష్ బాబు రాజకీయ ప్రవేశం వార్తలపై ఆయన సతీమణి నమ్రత స్పందించారు. పెదనాన్న ఆదిశేషగిరి రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో మహేష్ బాబు రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హైదరాబాద్: ప్రిన్స్  మహేష్ బాబు రాజకీయ ప్రవేశం వార్తలపై ఆయన సతీమణి నమ్రత స్పందించారు. పెదనాన్న ఆదిశేషగిరి రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో మహేష్ బాబు రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నమ్రత ఆ విషయంపై స్పందించారు. 

మహేశ్‌బాబుతో పద్నాలుగు వసంతాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న నమ్రతకు ఓ ప్రశ్న ఎదురైంది. రీల్‌ లైఫ్‌లో మహేశ్‌ని ముఖ్యమంత్రిగా చూశాం, రియల్‌ లైఫ్‌లో చూసే అవకాశం ఉందా అనేది ఆ ప్రశ్న. 

ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టారు. బాబును తెరపై చూస్తే చాలునని, బాబుకి కూడా రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదని సమ్రత సమాధానం చెప్పారు. మహేష్ బాబు ఫోకస్‌ అంతా నటన మీదేనని, ఆయన ప్రేమించేది సినిమాలనే అని నమ్రత అన్నారు. 

సినిమాలు తప్ప మరో విషయం మహేష్ బాబుకు అర్థం కాదని, బాబు రాజకీయాల్లోకి రాబోరని స్పష్టం చేశారు నమ్రత.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu
YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu