స్నేహితుడి లవర్ ఫోటోని తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టి..

Published : Feb 01, 2021, 08:05 AM ISTUpdated : Feb 01, 2021, 08:08 AM IST
స్నేహితుడి లవర్ ఫోటోని తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టి..

సారాంశం

ఉండవల్లి సెంటర్‌లో కొందరు విద్యార్థులు సాయికి పరిచయమయ్యారు. వారిలో ఒకరైన ఐటీఐ విద్యార్థి తన ఇంటికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

వాట్సాప్ స్టేటస్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయి ఫోటోని వాట్సాప్ స్టేటస్ గా పెట్టి.. ఐలవ్ యూ అని రాశాడు. చివరకు శవమై తేలాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాడేపల్లికి చెందిన గురవయ్య, శివకుమారి దంపతుల ఏకైక కుమారుడు వెంపటి సాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్‌లో కొందరు విద్యార్థులు సాయికి పరిచయమయ్యారు. వారిలో ఒకరైన ఐటీఐ విద్యార్థి తన ఇంటికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

ఆ యువతి ఫొటోను వెంపటి సాయి తన స్టేటస్‌లో పెట్టి.. ఐ లవ్‌ యు అని రాయడాన్ని ఐటీఐ విద్యార్థి చూశాడు. వెంటనే సాయిని ఉండవల్లి సెంటర్‌కి పిలిపించి మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాయి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థుల్ని విచారిస్తుండగా.. సాయి వడ్డేశ్వరం వద్ద బకింగ్‌హామ్‌ కెనాల్‌లో శవమై కనిపించాడు. సాయిని అతని స్నేహితులు చంపి కాలువలో పడేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు