ఖబడ్డార్, జాగ్రత్తగా ఉండండి : వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Jul 26, 2019, 4:32 PM IST
Highlights

 రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అత్యంత దారుణంగా వైసీపీ నేతలు హత్య చేశారని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దౌర్జాన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత ఆరోపించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ నేతలు వెళ్లే ప్రభుత్వ రోడ్డుపై గోడ కట్టారని ఆరోపించారు. దీనిపై పోలీస్ శాఖ, మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు.  

త్వరలోనే తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తారని చెప్పుకొచ్చారు. 48 గంటల్లో ప్రభుత్వం ఈ గోడపై తగిన చర్యలు తీసుకోకపోతే తాము న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. 

మరోవైపు ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమ్మపురం టీడీపీ మహిళా కార్యకర్తపై అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వివస్త్రను చేసి నడిరోడ్డుపై కాళ్లతో తన్ని చంపేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అడ్డుకున్న భర్తపై సైతం దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

రాష్ట్రంలో మహిళా హోంశాఖ మంత్రిగా సుచరిత ఉన్నారు. ఒక మహిళ అయి ఉండి ఆ మహిళ సమస్య మంత్రికి కనబడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడతానంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళపై దాడి హత్య కనబడలేదా అని నిలదీశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అత్యంత దారుణంగా వైసీపీ నేతలు హత్య చేశారని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. 

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖ సరిగ్గా స్పందించలేదని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీకు కూడా తప్పదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలు చేసే వైయస్ జగన్మోహన్ రెడ్డి తమను కాపాడతారని పోలీసులు భావిస్తున్నారని తాము ఉపేక్షించమన్నారు. 

శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్థానంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. చట్టం దగ్గర మీరంతా దోషులేనని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత పొలీసులదేనని చెప్పుకొచ్చారు. 

సామాన్యులకు ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ రక్షణ, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని నిలదీశారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పించాలని సూచించారు. లేని పక్షంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  

click me!