ఓటేయ్యరని భయంతో వాటిని నేనే నొక్కేసా: అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 26, 2019, 3:54 PM IST
Highlights

మార్కెట్ యార్డులను బతికించాలని, పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డుకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయలేదని అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా వాటిని విడుదల చేశామని చెప్పుకొచ్చారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 మార్కెటింగ్ బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించిన ధర్మశ్రీ తాను ఒక రైతును అంటూ చెప్పుకొచ్చారు. 

తనకు 25 ఎకరాల వ్యవసాయం ఉంటే దానిలో 5 ఎకరాలు తాను సొంతంగా పండించుకుంటానని మిగిలిన 20 ఎకరాలు నలుగురు కౌలు రైతులకు పండించుకోవడానికి ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన తండ్రి కాలం చేసిన తర్వాత తాను సంతోషంగా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. 

రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది రైతులు ఉంటే అందులో కౌలు రైతులే అత్యధికమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 16 లక్షలు మంది కౌలు రైతులు అని చెప్తోందని కానీ తనకు తెలిసి 40లక్షలు మంది కౌలురైతులు ఉండొచని అభిప్రాయపడ్డారు. 

మార్కెటింగ్ బిల్లు ద్వారా కౌలు రైతులకు కూడా ఎంతో మంచి జరుగుతుందన్నారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ పుట్ సబ్సీడీ, పంట భీమా, పంట నష్టాన్ని తామే నొక్కేశావాళ్లమని చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు ఇవ్వకుండా తామే నొక్కేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. 

తమకు గిట్టుబాటు కాకపోవడం వల్లే కౌలు రైతులకు ఇవ్వకుండా వాటిని నొక్కేసేవాడినని చెప్పుకొచ్చారు. కౌలు రైతు ఎంత ఇస్తే అంతే తీసుకునే వాడినని ఎందుకంటే రేపు ఓటు వేయరని భయం అంటూ చెప్పుకొచ్చారు. 

గత ప్రభుత్వంలో మార్కెటింగ్ కమిటీ  చైర్మన్లు కేవలం ఉత్సవ విగ్రహాలు లాగే ఉన్నారని కానీ తమ ప్రభుత్వం వారికి తగిన గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లు మార్కెట్ యార్డ్ లు నిర్వీర్యం అయిపోయాయన్నారు. 

మార్కెట్ యార్డులను బతికించాలని, పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మార్కెట్ యార్డుకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయలేదని అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా వాటిని విడుదల చేశామని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ బిల్లు ద్వారా సీఎం వైయస్ జగన్ రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. 

click me!