పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం

By Nagaraju penumalaFirst Published Oct 31, 2019, 6:51 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. నవంబర్ 3న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు చంద్రబాబు. 

గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నవంబర్ 3న పవన్ కళ్యాణ్ చేపట్టే లాంగ్ మార్చ్ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రంలో ఇసుకకొరతను నిరసిస్తూ నవంబర్ 3న విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. ఈ లాంగ్ మార్చ్ ను అంతా కలిసి విజయవంతం చేయాలని కోరారు పవన్ కళ్యాణ్.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, లోక్ సత్త పార్టీ వామపక్ష పార్టీలను కోరారు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే. 

ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే పలువురు చనిపోయారని వారికి అండగా నిలుస్తూ ఇసుకకొరతను నిరసిస్తూ జనసేన చేపట్టబోయే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని పవన్ కోరారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పవన్ తో వేధిక పంచుకోబోమని తేల్చి చెప్పారు. ఇసుకకొరతపై తాము మెుదటి నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక కొరతను నిరసిస్తూ భిక్షాటన చేశామని, సీఎం జగన్ కు లేఖలు రాశామని, గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. 

అందువల్ల పవన్ కళ్యాణ్ తో వేధిక పంచుకునేందుకు తాముసిద్ధంగా లేమని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే బయట నుంచి పవన్ కళ్యాణ్ పోరాటానికి మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. నవంబర్ 3న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ సీనియర్ నేతలు లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని తెలిపారు. 

ఆగస్టు 4వ తేదీన భీమవరం సమావేశంలో పాల్గొనడానికి రాజమండ్రి నుండి బయలుదేరిన పవన్ వాహనాన్ని ఆపి సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు తమ 
కష్టాలను తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక దొరకక తమ ఉపాధి పోయిందని వివరించారు. 

అలాగే మంగళగిరికి వెళ్ళినప్పుడు కూడా కొందరు భవన 
నిర్మాణ కార్మికులు ఇలాగే తమ బాధలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో కొద్దిగా  వేచి చూశానని...అయితే రాను రాను 
సమస్య మరింత తీవ్రతరం అవుతుండటంతో పోరాటానికి సిద్దమైనట్లు పవన్ వెల్లడించారు. 

ఇసుక అందరాని సరుకుగా మారిపోయి చివరకు ఉపాధిలేక కార్మికులు 
ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ఈ సమస్య పరిష్కారం కోసం విశాఖలో లాంగ్ మార్చ్ కు పిలుపు నిచ్చారు.  

అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని  మోడీ 
గారి దృష్టికి కూడా పవన్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చేయాలని పవన్ భావిస్తున్నారు.

ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కొందరు 
భవన నిర్మాణ కార్మికులు కలిసి విజ్ఞప్తి చేశారు. 

దీనికి మీరు చొరవ చూపాలని కోరారు. అలాగే తెలంగాణాలో జరుగుతున్న ఆర్.టి.సి సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కుడా చూపాలని వారు విన్నవించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ క్రెడిట్ బీజేపీదే, మీతో వేదిక పంచుకోం : పవన్ కల్యాణ్ కు కన్నా హ్యాండ్
ఇసుక కొరత: లాంగ్ మార్చ్ కు కన్నాను ఆహ్వానించిన పవన్ కల్యాణ్

click me!