ఈ నెల 29 నుండి లోకేష్ యువగళం పున:ప్రారంభం: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం

By narsimha lode  |  First Published Sep 26, 2023, 8:17 PM IST


జనసేనతో కలిసి వైఎస్ఆర్‌సీపీ సర్కార్ చేపట్టే  ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై  పోరాటం చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకుంది. 


అమరావతి:ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం మంగళవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. న్యూఢిల్లీలో ఉన్న నారా లోకేష్ వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు సూచన మేరకు పొలిటికల్ యాక్షన్ కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది.  14 మందితో కమిటీని ఆ పార్టీ  రెండు రోజుల క్రితం ప్రకటించింది.  ఈ కమిటీ తొలి సమావేశం  ఇవాళ జరిగింది.

ఈ నెల 29న రాత్రి 8:15 కు యువగళం పాదయాత్ర తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. టీడీపీ నేతలపై కక్షసాధింపులు కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Latest Videos

ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. లోకేష్ కు సంబంధం లేని విషయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడ ఆయన పేరును చేర్చారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేదు. భూ సేకరణ కూడా జరగలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. కానీ ఏదో జరిగిందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.మీరేం తప్పు చేశారు.. ఏం ఆధారాలున్నాయో చెప్పాలని కేసులు పెట్టిన అధికారులు అడగడం విడ్డూరంగా ఉందన్నారు.తమపై కేసులు వేసి ఓటర్ల జాబితాలో వైసీపీ  అవకతవకలకు పాల్పడుతోందని  అచ్చెన్నాయుడు విమర్శించారు. 
అన్ని స్థాయిల్లో ఓటర్ జాబితా వెరిఫికేషన్ చేపడతామన్నారు.
 

click me!