ప్రారంభమైన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం: పరిషత్ ఎన్నికలపై చర్చ

By narsimha lodeFirst Published Apr 2, 2021, 11:15 AM IST
Highlights

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. పరిషత్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

అమరావతి:టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. పరిషత్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

ఆన్‌లైన్ లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ గా  నీలం సహానీ ఈ నెల 1వ తేదీన  బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్ఈసీతో భేటీ అయ్యారు.పరిషత్ ఎన్నికల విషయమై చర్చించారు. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.పరిషత్ ఎన్నికల విషయమై ఎస్ఈసీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ తరుణంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చిస్తున్నారు. గతంలో ఆగిన చోటు నుండే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.ఇదే విషయాన్ని నీలం సహానీతో వర్ల రామయ్య భేటీ సందర్భంగా చెప్పారు.

కానీ ఎస్ఈసీ ఆగిన చోటునుండే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది టీడీపీ. ఈ విషయమై  పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చిస్తున్నారు. మెజార్టీ నేతలు ఈ ఎన్నికలను బహిష్కరించాలనే అభిప్రాయంతో ఉన్నారు.ఈ విషయమై మధ్యాహ్నం 1 గంటకు చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది.
 

click me!