శాసనమండలి పరిణామాలపై గవర్నర్‌‌ను కలిసే యోచనలో బాబు

Published : Jan 23, 2020, 11:32 AM ISTUpdated : Jan 23, 2020, 12:27 PM IST
శాసనమండలి పరిణామాలపై గవర్నర్‌‌ను కలిసే యోచనలో బాబు

సారాంశం

ఏపీ శాసనమండలిలో చోటు చేసుకొన్న పరిణామాలపై గవర్నర్ ను కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 


అమరావతి: ఏపీ శాసనమండలిలో చోటు చేసుకొన్న పరిణామాలపై గురువారం నాడు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.

Also read:మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు:పవన్ కళ్యాణ్

ఏపీ శాసనమండలిలో  బుధవారం నాడు చోటు చేసుకొన్న పరిణామాలపై చంద్రబాబునాయుడు గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని  భావిస్తున్నారు.గురువారం నాడు చంద్రబాబునాయుడు  ఓ జాతీయ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడారు.

బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు తగిన సమయం కూడ  ఇవ్వలేదని చంద్రబాబునాయుడు  విమర్శించారు. శాసనమండలి ఛైర్మెన్ షరీప్‌పై మంత్రులు దాడి చేసినంత పనిచేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

ఏ పార్టీ ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది బీజేపీ, జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయనివ్వండి చూద్దామన్నారు.మరో వైపు బీజేపీతో భవిష్యత్తులో టీడీపీ కలిసి పనిచేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు మాత్రం చంద్రబాబునాయుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు.

ఊహజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చంద్రబాబునాయుడు చెప్పారు.   మరో వైపు హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదని చంద్రబాబునాయుడు చెప్పారు. హైకోర్టు ఏర్పాటు కేంద్ర  ప్రభుత్వం పరిధిలో ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

తాను కూడ రాయలసీమ ప్రాంతానికి చెందినవాడినని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. రాయలసీమకు తెలుగు గంగ ద్వారా  నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన గుర్తు చేశారు.

రాయలసీమ ప్రాంతానికి  ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన ఘనత తనకు ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి గత ఐదేళ్ల కాలంలో  తీసుకొచ్చిన ఫ్యాక్టరీలను, ఉపాధి అవకాశాలను కల్పించిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

హెరిటేజ్  కంపెనీ రాజధానికి సమీపంలో భూములను కొనుగోలు చేసిందన్నారు. నాగార్జున యూనివర్శిటీకి సమీపంలో హెరిటేజ్ కంపెనీ భూములు కొనుగోలు చేసిన విషయంలో తప్పేం ఉందని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాయలసీమకు జగన్ ఆయన తండ్రి ఏం చేశారని  చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 

అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని  చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం  రాజధాని కేసును  వాదించేందుకు గాను  ముకుల్ రోహిత్గీకి కోట్లాది రూపాయాలను కేటాయించడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?