Chandrababu: వెంటిలేటర్‌పై టీడీపీ.. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాట: సజ్జల

Published : Feb 08, 2024, 09:36 PM IST
Chandrababu: వెంటిలేటర్‌పై టీడీపీ.. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాట: సజ్జల

సారాంశం

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు సంధించారు. టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నదని, బలహీనమైన దశలో ఉండటం మూలంగా చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని అన్నారు. వైఎస్ షర్మిల చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు.  

YS Jagan: వైసీపీ కీలక నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నది, అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని, తీరా.. ఇక్కడ బీజేపీనే పొత్తు కోసం తమ వెంట పడుతున్నట్టు బిల్డప్ ఇస్తారని ఫైర్ అయ్యారు. టీడీపీ బలహీనంగా ఉన్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు తీవ్రంగా విమర్శలు చేసిన బీజేపీతో ఇప్పుడు చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్లుతారని, ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపైనా సజ్జల కామెంట్లు చేశారు. వైఎస్ షర్మిల చేసే ఆరోపణలు సత్యదూరం అని అన్నారు. ఆమె చంద్రబాబు నాయుడుకు అద్దె మైకుగా మారారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఆమె చదువుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో షర్మిల వెళ్లుతుననారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేదని తెలిపారు.

Also Read: Chandrababu: అరుణ్ జైట్లీ ఉంటే ఇప్పటికే టీడీపీ, బీజేపీ కలిసిపోయేవి.. : బీజేపీతో చంద్రబాబు భేటీపై సుజనా చౌదరి

వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లడంపైనా ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో దాపరికం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అజెండాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడటానికే వెళ్లాడని తెలిపారు. జగన్‌కు ఎవరి సహాయం అక్కర్లేదని, సింగిల్‌గా బరిలో దిగుతారని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?