Chandrababu: అరుణ్ జైట్లీ ఉంటే ఇప్పటికే టీడీపీ, బీజేపీ కలిసిపోయేవి.. : బీజేపీతో చంద్రబాబు భేటీపై సుజనా చౌదరి

By Mahesh K  |  First Published Feb 8, 2024, 8:49 PM IST

చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఎన్డీయేలోకి చేరడం అసాధ్యమేమీ కాదని పేర్కొంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ప్రస్తావించారు. చంద్రబాబు భేటీలు సానుకూల సంకేతాలనే ఇచ్చాయని వివరించారు.
 


Chandrababu: చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమైన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో బీజేపీ పొత్తు విషయమై ఈ భేటీలు జరిగాయి. చంద్రబాబు భేటీ తర్వాత సమావేశంలో జరిగిన నిర్ణయాలపై ఎలాంటి విషయాలు బయటకు రాలేవు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ సుజనా చౌదరి ఈ భేటీ పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీతో చంద్రబాబు భేటీ పాజిటివ్‌గానే జరిగిందని వివరించారు. సానుకూల సంకేతాలను ఆయన ఇచ్చారు. ‘జేపీ నడ్డా, అమిత్ షాలతో చంద్రబాబు నాయుడు భేటీ పాజిటివ్‌గా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. పొత్తుకు బీజేపీని ఒప్పించే బాధ్యత చంద్రబాబు నాయుడిపైనే ఉంటుంది. అసలు ఆయన ఎన్డీఏ కూటమి ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో చెప్పి బీజేపీని ఒప్పించాలి’ అని అన్నారు. గతంలోనూ బీజేపీ, టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు జరిగాయి. అవి సత్ఫలితాలను ఇవ్వలేవని వివరించారు.

Latest Videos

Also Read: Telangana BJP: అసెంబ్లీ ఫలితాలతో రూటుమార్చిన టీ బీజేపీ.. పొత్తులపై కీలక నిర్ణయం

ఈ సందర్భంగా ఆయన అరుణ్ జైట్లీ ప్రస్తావన తెచ్చారు. ఒక వేళ అరుణ్ జైట్లీ జీవించి ఉంటే బీజేపీ, టీడీపీలు ఇప్పటికే పొత్తులో ఉండేవని అన్నారు. రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తే పొత్తు సాధ్యమే అని వివరించారు. మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లడం అసాధ్యమేమీ కాదు అంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ప్రస్తావించారు.

click me!