టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.గురువారం నాడు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.గురువారం నాడు అమరావతిలోని Tdp కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లోని అన్నీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయని ఆయన చెప్పారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో పది మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారని Payyavula Keshav తెలిపారు. Dgp కార్యాలయంలోని పీఆర్ఓ కూడా ఇందులో పాల్గొన్నారన్నారు.
also read:జగన్‌పై పట్టాభి బూతు వ్యాఖ్యలు: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జనాగ్రహ దీక్షలు
undefined
డీజీపీ ఆఫీస్ పర్యవేక్షణలోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఆయన చెప్పారు. ఈ దాడి వెనుక కుట్ర మూలాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దాడి వెనుక డీజీపీ పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈ కుట్రకు సంబంధించిన వాస్తవాలు నిగ్గు తేలాలంటే తాడేపల్లి సెల్‌ఫోన్ టవర్ నుండి Vijayawada కన్వెన్షన్ సెంటర్ వరకు ఉన్న సెల్ టవర్ కాల్ డేటా బయటపెట్టాలన్నారు. ఫ్రైడ్ ఆఫ్ ఇండియా స్థాయిలో ఉన్న ఏపీ పోలీస్‌ను దేశంలో చివరి స్థానంలో నిలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తమపై దాడులు చేసినా వెనక్కి తగ్గబోమన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయిస్తామని కేశవ్ తేల్చి చెప్పారు.
సమాజాన్ని కాపాడడం కోసం పోలీసులున్నారని కానీ పోలీసులే దాడుల్లో పాల్గొన్న చరిత్ర ఏనాడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. గంజాయిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆయన అడిగారు. కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులది తప్పు లేదన్నారు. కానీ IPS స్థాయి అధికారులు ఏ రకంగా విధులు నిర్వహిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.క్షేత్రస్థాయిలోని Police అంతర్మథనంలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీలో Drugs దందా పెరుగుతుంటే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.డ్రగ్స్ పై టీడీపీ చేస్తున్న పోరాటం మంచిదా కాదా అనే విషయాన్ని పోలీసులు తమ కుటుంబసభ్యులను అడగాలని ఆయన కోరారు.