రాజన్న రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం: జగన్ 100రోజుల పాలనపై నారా లోకేష్

By Nagaraju penumalaFirst Published Sep 6, 2019, 3:57 PM IST
Highlights

రాజన్న రాజ్యం తీసుకొస్తారునుకంటే రాక్షస రాజ్యం తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఎలాంటి తప్పుచేయక పోయినా అమాకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకుగురి చేస్తున్నారంటూ ఆరోపించారు. కులమతాలకు అతీతంగా టీడీపికి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.  

గుంటూరు: ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వందరోజుల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ వందరోజుల పాలనను ఎంతో ఓపికగా చూసినట్లు తెలిపారు. ఇక ఓపిక నశించిందని సహించేది లేదని తెగేసి చెప్పారు. 

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా కార్యకర్తలను చంపారో ఇప్పుడు అదే విధంగా కార్యకర్తలను బలితీసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాస శిబిరాన్ని సందర్శించిన నారా లోకేష్ బాధితులను పరామర్శించారు. 

తాము అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని వారికి ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు.

వైసీపీ బాధితుల కోసం శిబిరాన్ని ప్రారంభించి నాలుగు రోజులు అయినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు లోకేష్. బాధిత కుటుంబాలకు రూ.10, వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారి పిల్లలకు ఉన్నత విద్యను అందించనున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. 

రాజన్న రాజ్యం తీసుకొస్తారునుకంటే రాక్షస రాజ్యం తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఎలాంటి తప్పుచేయక పోయినా అమాకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకుగురి చేస్తున్నారంటూ ఆరోపించారు. కులమతాలకు అతీతంగా టీడీపికి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.  
 
ఈ వార్తలు కూడా చదవండి

క్షమించలేనన్ని తప్పులు చేశారు : జగన్ 100రోజుల పాలనపై చంద్రబాబు కామెంట్స్

click me!