నేడు రాజమండ్రికి లోకేష్: రేపు బాబుతో ములాఖత్

By narsimha lode  |  First Published Oct 5, 2023, 9:41 AM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఏపీకి రానున్నారు.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుండి ఆయన అక్కడే ఉన్నారు.


హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఇవాళ రాజమండ్రికి చేరుకుంటారు.  రేపు చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కానున్నారు. గత నెల 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  ఇవాళ్టితో చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ ముగియనుంది.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో  న్యాయ నిపుణులతో చర్చించడంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలను కలిసేందుకు  నారా లోకేష్ గత నెల 14న న్యూఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుండి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ రాజమండ్రికి లోకేష్ రానున్నారు. రేపు  చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కానున్నారు. ఈ నెల 9వ తేదీన మరోసారి ఢిల్లీకి వెళ్తారు.  అదే రోజున ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై  చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. దీంతో ఈ నెల 9వ తేదీన  న్యూఢిల్లీకి వెళ్లాలని  లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.

Latest Videos

undefined

మరో వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.  ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను  సీఎం జగన్ కలవనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడ జగన్ భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇదే  తొలి సారి. గత నెలలోనే జగన్ ఢిల్లీకి వెళ్లాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.ఇవాళ, రేపు జగన్ ఢిల్లీలోనే ఉంటారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  వస్తున్నారు. మరో వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీకి వెళ్తున్నారు.


 

click me!