టిడిపి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి అరెస్ట్... టిటిడి మాజీ ఛైర్మన్ పైనా కేసు

By Arun Kumar PFirst Published Mar 8, 2021, 10:58 AM IST
Highlights

తమ విధులకు ఆటంకం కలిగించారంటూ టిటిపి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెడ్డ్యం వెంకట సుబ్బారెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 

అమరావతి: కడప జిల్లాలోని మైదుకూరు పట్టణంలో టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జగన్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టిడిపి శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే మైదుకూరు పోలీస్ ‌స్టేషన్‌ ఎదుట టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీంతో మరికొందరు స్థానిక టీడీపీ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ టిటిపి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెడ్డ్యం వెంకట సుబ్బారెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఇదిలావుంటే నేటితో(సోమవారం) మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలోనే చివరిరోజు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరులో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.00గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు.

read more  ఆయన రేంజ్ ఈడీ నుంచి ఇంటర్‌పోల్‌కి పెరిగింది: జగన్‌పై లోకేశ్ సెటైర్లు

ఇక, ఎల్లుండి రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈనెల 14న ఓట్లను లెక్కించనున్నారు.   పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.  డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో... ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.  మొత్తంగా ఇవాళ ప్రచారానికి తెరపడినా.. సైలెంట్‌గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు ప్లాన్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.

 పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మార్చి 10వ తేదీన జరిగే మున్సిపల్​ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తోందన్నారు. ప్రజలందరూ కలిసి పురపాలక ఎన్నికలను జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు.

click me!