వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షాకి టీడీపీ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Feb 03, 2021, 07:20 PM ISTUpdated : Feb 03, 2021, 07:43 PM IST
వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షాకి టీడీపీ ఫిర్యాదు

సారాంశం

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఆలయాల దాడులు, మతమార్పిడిలపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కేసులు పెడుతున్నారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఆలయాల దాడులు, మతమార్పిడిలపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కేసులు పెడుతున్నారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షనేతతో పాటు ప్రతిపక్షనేతలపై దాడులు చేస్తున్నారని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు సమర్పించామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిని రెండోసారి అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టారని ఎద్దేవా చేశారు.

దేవాలయాలపై దాడులు చేస్తున్నారని.. గతేదాడి కాలంలో ఎన్ని ఘటనలు జరిగియో అందరికీ తెలుసునని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. ఏపీలో నియంత పాలన జరుగుతోందని.. రాజ్యాంగ వ్యవస్థల్ని స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని ఎంపీ కనకమేడల మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?