కేంద్రంతో అమీతుమీ: సుజనా ఇంట్లో టీడీపీ ఎంపీల భేటీ

First Published Jul 18, 2018, 10:40 AM IST
Highlights

ప్రత్యేక హోదాతో పాటు ,విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  కేంద్రంపై అవిశ్వాస తీర్మాణ నోటీసులు టీడీపీ ఇచ్చింది.   ఈ తరుణంలో  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  టీడీపీ ఎంపీలు చర్చించారు.


న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాతో పాటు ,విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  కేంద్రంపై అవిశ్వాస తీర్మాణ నోటీసులు టీడీపీ ఇచ్చింది.   ఈ తరుణంలో  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  టీడీపీ ఎంపీలు చర్చించారు.ఈ మేరకు  సుజనాచౌదరి ఇంట్లో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు.

బుధవారం  ఉదయం  న్యూఢిల్లీలోని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంట్లో  టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు.  పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రతిపాదించిన తరుణంలో  పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే  అవిశ్వాసంపై కలిసి రావాలని  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలను   కలిశారు.  అవిశ్వాస తీర్మాణానికి మద్దతివ్వాలని కోరారు.

ఈ మేరకు కొన్ని పార్టీలు తమకు సానుకూలంగా స్పందన తెలిపాయని  టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే నాలుగేళ్లుగా ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి ఏ మేరకు నిధులు ఇచ్చామనే విషయాన్ని కూడ  పార్లమెంట్ వేదికగా చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని  బీజేపీ నేతలు  ప్రకటించారు.

టీడీపీ, బీజేపీ నేతలు అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు.  అవిశ్వాసంపై  చర్చకు తాము సిద్దంగా ఉన్నామని  బీజేపీ నేతలు కూడ ప్రకటించారు. ఈ తరుణంలో  జూలై 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  రాజకీయంగా వేడిని పుట్టించే అవకాశం లేకపోలేదు..
 

click me!