సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు:ఏపీ సీఐడీ చీఫ్ పై అమిత్ షాకు టీడీపీ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Sep 28, 2023, 2:41 PM IST

ఏపీ సీఐడీ సంజయ్ పై  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు టీడీపీ ఫిర్యాదు చేసింది.  సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది. 


న్యూఢిల్లీ: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు  టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు  గురువారంనాడు ఫిర్యాదు చేశారు. 
సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి  సీఐడీ చీఫ్ సంజయ్ పనిచేస్తున్నారని అమిత్ షాకు  టీడీపీ ఫిర్యాదు చేసింది. విచారణ జరపకుండానే చంద్రబాబుపై ఆరోపణలు చేశారన్నారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను బహిరంగంగా మీడియాకు చెబుతున్నారని  కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతిపత్రంలో  టీడీపీ ఎంపీ  రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.వైసీపీకి అనుకూలంగా ఏపీ సీఐడీ చీఫ్ పనిచేస్తున్నాడని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

హైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ సీఐడీ  చీఫ్ సంజయ్  చంద్రబాబు అరెస్ట్ పరిణామాలను  వివరించారు. అంతేకాదు  చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును కూడ టీడీపీ నేతలు తప్పుబట్టారు. 

Latest Videos

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును  సీఐడీ అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబుకు అక్టోబర్ 5వ తేదీ వరకు  జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో తనపై నమోదైన  ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడంతో పాటు  రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ పై అక్టోబర్ 3వ తేదీన  విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

click me!