కేసీఆర్, జగన్ తోడు దొంగలే: కేశినేని నాని విమర్శలు

By narsimha lode  |  First Published Jul 1, 2021, 12:26 PM IST

 రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు  ఇద్దరూ  తోడు దొంగలేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై  రెండు రాష్ట్రాలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నాయి. ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 


విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు  ఇద్దరూ  తోడు దొంగలేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై  రెండు రాష్ట్రాలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నాయి. ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా ఎన్నికల ముందు కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉంది.  ప్రజలను ఈ ఇద్దరూ పిచ్చోళ్లను చేసి ఆడుకొంటున్నారన్నారు. హైద్రాబాద్ లోని ఆస్తును కాపాడుకొనేందుకు కేసీఆర్ తోకలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు.  ఏపీ ప్రజలు ఆ డ్రామాలను గమనించలేనంత పిచ్చోలు కాదన్నారు.

Latest Videos

undefined

also read:జల వివాదం.. ఏపీ - తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు: సాగర్ వద్ద భారీ భద్రత

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ , ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై ఏపీపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరకు రెండు లేఖలను కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ రాసింది.విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణను ఆదేశించింది. కానీ తెలంగాణ మాత్రం జలవిద్యుత్ ఉత్పత్నిని కొనసాగిస్తోంది.


 

click me!