వైఎస్ఆర్ భీమా పథకం ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

By narsimha lodeFirst Published Jul 1, 2021, 12:02 PM IST
Highlights

వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు ప్రారంభించారు.

అమరావతి:వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు ప్రారంభించారు.ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి  వర్చువల్ గా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 1.32 కోట్ల పేదల కుటుంబాలకు రూ. 750 కోట్లతో భీమా సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం.  కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేయనున్నారు.

రూ. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చినట్టుగా సీఎం గుర్తు చేశారు. వెయ్యికి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు.18 నుండి 50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే లక్ష రూపాయాల ఆర్ధిక సహాయం  అందించనుంది ప్రభుత్వం. 18 నుండి 70 ఏళ్లలోపు వాళ్లు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంబవించినా రూన. 5 లక్షల భీమా అందించనున్నారు. 

వైఎస్ఆర్ భీమా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్దతిలో ప్రసంగించారు. రూ. 750 కోట్లతో వైఎస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. పేదలకు ఎలాంటి భారం పడకుండా భీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోతే భీమా సొమ్మును బాధిత కుటుంబానికి అందిస్తామన్నారు.రాష్ట్రంలోని 1.32 కోట్ల మంది ఈ పథకం లబ్ది కలగనుంది సీఎం వివరించారు.  ఈ భీమా పథకం గురించి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

click me!