హత్య ఎవరు చేసినా అది తప్పే: కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కేశినేని నాని

Arun Kumar P   | Asianet News
Published : Jul 04, 2020, 09:16 PM ISTUpdated : Jul 04, 2020, 09:25 PM IST
హత్య ఎవరు చేసినా అది తప్పే: కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కేశినేని నాని

సారాంశం

మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ  అరెస్ట్ పై టిడిపి ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికన స్పందించారు. 

అమరావతి: మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ  అరెస్ట్ పై టిడిపి ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికన స్పందించారు. 

''హత్య ఎవరు చేసినా అది తప్పే కాని కొల్లు రవీంద్ర ఇటువంటి పని చేస్తాడని నాతో సహా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అధికారం వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు.. అధికారం శాశ్వతం కాదు అని గుర్తుంచకోవాలి. ఈ అక్రమ అరస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

video   భాస్కర్ రావు హత్యలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర పాత్ర ఇదీ.. ఎస్పీ (వీడియో)

శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద జాతీయ రహదారి పై రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు మప్టీ లో వెళ్లి అరెస్ట్ చేశారు.కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు తుని నుండి విజయవాడ కు తరలించారు.   

శనివారం ఉదయం కొల్లును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే రవీంద్రను జైలుకు తరలించడంపై పోలీసులు తర్జనభర్జన పడ్డారు. దీంతో ఆయన ఉదయం నుంచి గూడూరు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. ఏ జైలుకు తరలించాలనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో పోలీసుల్లో అయోమయం నెలకొంది. అయితే చివరకు రవీంద్రను పోలీసులు బందర్ సబ్ జైలుకు తరలించారు.

కాగా.. కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. శనివారం భాస్కరరావు హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రాజకీయపరమైన, కులపరమైన అధిపత్యపోరులో భాగంగానే పక్కా పథకంతో భాస్కరరావును హతమార్చారని ఎస్పీ చెప్పారు. నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించారని తెలిపారు.

రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు హత్యకు పాల్పడ్డారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశామని.. వీరిలో ఒకరు కొల్లు రవీంద్ర, మరో మైనర్ బాలుడు ఉన్నాడన్నారు. అత్యవసరమైతే నాకు ఫోన్ చేయకండి, నా పీఎలలో ఎవరికైనా ఒకరికి ఫోన్ చేయండని రవీంద్ర నిందితులకు చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. హత్య జరగక ముందు కూడా నిందితులు పీఎ ద్వారా రవీంద్రతో మాట్లాడారని వెల్లడించారు.

హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకరైన నాంచారయ్య .... పీఎకు ఫోన్ చేసి రవీంద్రతో మాట్లాడాడని ఎస్పీ తెలిపారు. పనైపోయిందని నాంచారయ్య చెప్పగా జాగ్రత్తగా ఉండమని రవీంద్ర వారికి చెప్పారని వెల్లడించారు.  అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించామని రవీంద్రబాబు వెల్లడించారు. చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. విచారణ జరిపి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని జిల్లా ఎస్పీ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu