గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు భేటీ అయ్యారు. వీరిద్దరూ వల్లభనేని వంశీతో చర్చించారు.
విజయవాడ: టీడీపీకి వల్లభనేని వంశీ అవసరం ఎంత అవసరమో, వంశీకి కూడ టీడీపీ అవసరం అంతే ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో చర్చల వివరాలను కేశినేని నాని చంద్రబాబునాయుడుకు వివరించారు.
Also Read:జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ వెలిబుచ్చిన అభిప్రాయాలను తాము చంద్రబాబుకు వివరించినట్టుగా చెప్పారు.వల్లభనేని వంశీని వదులుకోవడం పార్టికి ఇష్టం లేదని కేశినేని నాని చెప్పారు. వల్లభనేని వంశీ వెలిబుచ్చిన అనుమానాలను ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు నివృత్తి చేసే ప్రయత్నం చేశామన్నారు.
Also Read:వల్లభనేని వంశీ ఎఫెక్ట్, అఖిలప్రియ భర్తపై కేసు: జగన్ పై చంద్రబాబు భగ్గు
కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సమస్యలుంటాయని కేశినేని నాని చెప్పారు. వైసీపీ గాలిలో కూడ వీరోచితింగా పోరాటం చేసి గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీ విజయం సాధించిన విషయాన్ని నాని గుర్తు చేశారు.ఎన్నికల్లో గెలిచిన వంశీ ఇప్పుడు వెన్ను చూపడం సరైంది కాదన్నారు. పారిపోవడం మొదలు పెడితే జీవితాంతం పారిపోవాల్సి వస్తోందన్నారు.
Also Read:Vallabhaneni Vamsi : పనిచేయని బుజ్జగింపులు.. వైసిపిలోకి వల్లభనేని వంశీ ఎంట్రీ ఖాయం
వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి కూడా వంశీ అంతే అవసరమని నాని తెలిపారు. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని, అంతిమంగా నిర్ణయం ప్రకటించాల్సింది ఆయనేనని కేశినేని స్పష్టం చేశారు.
Also read:Also Read:వల్లభనేని వంశీ ఎపిసోడ్: ఆ ఎమ్మెల్యే కూడా టచ్‌లో ఉన్నారన్న బీజేపీ
వల్లభనేని వంశీని బుజ్జగించేందుకు గాను విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో చంద్రబాబునాయుడు కమిటిని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వల్లభనేని వంశీతో చర్చించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుధవారం నాడు సుధీర్ఘంగా వల్లభనేని వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులు చర్చించారు.