టిడిపి ఎంపీ సీఎం రమేష్‌పై వాట్సాప్ చర్యలు...

By Arun Kumar PFirst Published Feb 9, 2019, 9:43 AM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ  విషయంలో సీరియస్  గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది. 

తెలుగు దేశం పార్టీ పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన వాట్సాప్ అకౌంట్ ను సదరు సంస్థ బ్లాక్ చేసింది. ఆయన తాము విధించిన నిబంధనలను ఉళ్లంఘించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయన  వాట్సాప్ అకౌంట్ పై తమకు పలు ఫిర్యాదులు అందాయని...వాటి  ఆదారంగా విచారణ జరిపే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో  కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. తాన వాట్సాప్ అకౌంట్ పనిచేయకపోవడంపై ఇప్పటికే ఆ సంస్థకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇదే వాట్సప్ అకౌంట్ ద్వారా ప్రజలు తనతో వారి సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటారని...హటాత్తుగా ఇలా అకౌంట్ బ్లాక్ చేయడం వల్ల వాళ్లతో తన సంబంధాలు తెగిపోయే అవకాశం వుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.         

click me!