జగన్ జాంబీరెడ్డి, అనపర్తిలో యాక్టర్ సూర్యానారాయణ రెడ్డి.. వీరిద్దరికి చిప్పకూడు ఖాయం: లోకేశ్

Siva Kodati |  
Published : Apr 15, 2021, 03:09 PM IST
జగన్ జాంబీరెడ్డి, అనపర్తిలో యాక్టర్ సూర్యానారాయణ రెడ్డి.. వీరిద్దరికి చిప్పకూడు ఖాయం: లోకేశ్

సారాంశం

జగన్ రెడ్డి జాంబీ రెడ్డిలా తయారయ్యాడంటూ సెటైర్లు వేశారు టీడీపీ నేత నారా లోకేశ్. గురువారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వారికి ఆనందం వస్తుందని తెలిపారు.

జగన్ రెడ్డి జాంబీ రెడ్డిలా తయారయ్యాడంటూ సెటైర్లు వేశారు టీడీపీ నేత నారా లోకేశ్. గురువారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వారికి ఆనందం వస్తుందని తెలిపారు.

కానీ జాంబీ రెడ్డికి టిడిపి నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం,అరెస్ట్ చెయ్యడంలో ఆనందం వస్తుందంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న జాంబీ రెడ్డి రెండేళ్ల పాలనలో 25 మంది కార్యకర్తలను హత్య చేయించారని ఆయన ఆరోపించారు.

రోజుకో టిడిపి నాయకుడి  కేసు, రెండు రోజులకో అరెస్ట్... ఇవ్వన్నీ టీవీలో చూసి తాడేపల్లి సీఎం తొడ కొట్టుకుంటున్నారంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. అనపర్తి లో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు అన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కాదు ఆయన యాక్టర్సూర్యనారాయణ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అనపర్తిలో టిడిపి నేత రామకృష్ణారెడ్డి...యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అవినీతి ని ఆధారాలతో సహా బయటపెట్టారుని లోకేశ్ గుర్తుచేశారు. గ్రావెల్ మాఫియా, భూసేకరణ, పేకాట, నాటుసారా, తూకాలు చివరికి కరోనాను కూడా క్యాష్ చేసుకుని సూర్యనారాయణ రెడ్డి కోట్లు కొల్లగొట్టారని లోకేశ్ ఆరోపించారు.

అనపర్తిలో ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు రామకృష్ణారెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 2021 జనవరి 18 న సత్తి రాజు రెడ్డి బలభద్రపురం సమీపంలో కెనాల్ రోడ్డు పై పడి చనిపోయారుని ఆయన గుర్తుచేశారు.

జనవరి 15 న మన సూర్యనారాయణ రెడ్డి.. సత్తిరాజు రెడ్డికి వైద్యం చేసారని లోకేశ్ తెలిపారు. హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది అని చెప్పి రాజమండ్రి బొల్లినేని హాస్పటల్ కి రిఫర్ చేసారని చెప్పారు. అయితే జనవరి 19 న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గుండెపోటు అని తేలిందని... అయినప్పటికీ సూర్యనారాయణ రెడ్డి శవ రాజకీయం మొదలుపెట్టి.. పోలీసుల పై ఒత్తిడి తెచ్చారుని లోకేశ్ ఆరోపించారు.

అప్పుడు కుదరక పోవడంతో ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని తారుమారు చేసి.. ఎమ్మెల్యే ఒత్తిడితో దానిని ఆత్మహత్య గా మార్చి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసారని నారా లోకేశ్ ఆరోపించారు. 8 రోజుల పాటు కాకినాడ సబ్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టి వేధించారని ఆయన మండిపడ్డారు.

మీరు చేస్తున్న అవినీతి ఆధారాలతో సహా మా దగ్గర ఉందన్న లోకేశ్ టీడీపీ అధికారంలోకి వచ్చాకా దర్యాప్తు చేస్తామని హెచ్చరించారు. జాంబీ రెడ్డి, యాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి జైలులో చిప్ప కూడు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu