ఎన్నారై ఫ్యామిలీ మృతి మిస్టరీ: చివరగా వచ్చింది తండ్రే, చంపేసి దీపక్ ఆత్మహత్య?

By telugu team  |  First Published Apr 15, 2021, 12:34 PM IST

విశాఖపట్నం ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఎన్నారై కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటనపై మిస్టరీ వీడుతోంది. ఫ్లాట్ లోకి బుధవారం రాత్రి ఎవరూ రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మధురవాడ ఆదియ్త పార్చూన్ లో జరిగిన ఎన్నారై కుటుంబ సభ్యుల మృతి మిస్టరీ వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బంగారు నాయుడు పెద్ద కుామరుడు దీపక్ ముగ్గురిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాడు. విశాఖపట్నం పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. 

పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అదిత్య ఫార్చూన్ ఆపార్టుమెంటులోని ఆ కుటుంబం ఉంటున్న 505 నెంబర్ ఫ్లాట్ లోకి ఇతరులు ఎవరూ రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. చివరగా ఫ్లాట్ లోకి బుధవారం రాత్రి 9.56 గంటల సమయంలో బంగారునాయుడు వచ్చినట్లు గుర్తించారు గురువారం తెల్లవారుజామున ఓ మహిళ అపార్టుమెంటు గ్రూప్ లో పెట్టిన సందేశం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. 

Latest Videos

undefined

ఫ్లాట్ లోంచి పొగలు వస్తున్నాయని ఆమె వాట్సప్ లో మెసేజ్ పెట్టింది. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా ఫ్లాట్ తలుపులు మూసి ఉన్నాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఫ్లాట్ లో పోలీసులకు నాలుగు మృతదేహాలు కాలిన స్థితిలో కనిపించాయి. బంగారునాయుడి శవం, ఆయన భార్య డాక్టర్ నిర్మల, చిన్న కుమారుడు కశ్యప్ మృతదేహాలు ఒక్క చోట కనిపించగా, పెద్ద కుమారుడు దీపక్ శవం దూరంగా కనిపించింది. దీంతో దీపక్ వారిని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బంగారునాయుడు దాదాపు పాతికేళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి పిల్లల చదువుల కోసం విశాఖపట్నం వచ్చారు. దీపక్ ఎన్ఐటీ పూర్తి చేసి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. చదువు ఒత్తిడికి దీపక్ గురై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగిందని భావిస్తున్నారు. ఈ గొడవల్లోనే దీపక్ ముగ్గురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. 

విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి ముగ్గురిని పెద్ద కుమారుడు దీపక్ హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. మృతదేహాలపై రక్తం గుర్తులున్నాయి ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. 

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది. 

మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.

click me!