నువ్వెంత నీ బ్రతుకెంత.. నాలుక కోస్తాం: వెల్లంపల్లికి టిడిపి ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Jan 3, 2021, 11:43 AM IST

పేదల అభ్యున్నతి కోసం రూ.14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును పట్టుకుని వెధవ అని మంత్రి వెల్లంపల్లి సంభోధించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు.


అమరావతి: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర కొబ్బరి చిప్పలు లాక్కుని రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది నోటికొచ్చింది వాగితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరంటూ వెల్లంపల్లిపై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. 

''నోరు, నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. పేదల అభ్యున్నతి కోసం రూ.14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను దానం చేసిన అశోక్ గజపతిరాజును పట్టుకుని వెధవ అని సంభోధించడం నీ అహంకారానికి నిదర్శనం. ఆయన పేరు ఎత్తితో ప్రజలు చేతులు జోడించి నమస్కరిస్తారు. భూ భక్షుకుడైన నువ్వు.. భూదానం చేసిన అశోక్ గజపతిరాజును ఏకవచనంతో మాట్లాడతావా? వెల్లంపల్లి లాంటి అవినీతి పుత్రులకు గజపతిరాజు గొప్పతనం ఏం తెలుసు?'' అంటూ మండిపడ్డారు.

Latest Videos

undefined

''ఆలయాన్ని రక్షించలేదని అశోక్ గజపతి రాజును చైర్మన్ గా తొలగించామని చెప్తున్నారు... మరి 19 నెలలుగా రాష్ట్రంలో 127 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేదు. అది చేతకాని తనం కాదా? నీ అసమర్థతకు నిదర్శనం అని మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? దేవాదాయా శాఖా మంత్రిగా ఉండి ఏం ఉద్దరించారు?'' అంటూ నిలదీశారు.

read more  రామతీర్థంలో టెన్షన్ టెన్షన్: చలో రామతీర్థం, మంత్రుల సందర్శనతో

''వెల్లంపల్లి మంత్రి అయ్యాక వేలాది ఎకరాల మాన్యం భూములు అన్యాక్రాంతం చేశారు. దేవుళ్ల ఆగ్రహానికి గురయ్యే మొదటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దుర్గగుడిలో వెండి సింహాలు నీ కనుసనల్లోనే మాయమయ్యాయనేది నిజం కాదా? అశోక్ గజపతిరాజు దేశం మొత్తం సుపరిచితులైప వ్యక్తి. ఆయన్ను విమర్శించే స్థాయా నీది? నువ్వెత నీ బతుకెంత? పదవి కాపాడుకోవడానికి ఇష్టానుసారంగా మాట్లాడతామంటే నాలుక కోస్తాం'' అంటూ హెచ్చరించారు.

''మంత్రి వెల్లంపల్లిని దేశ బహిష్కరణ చేయాలి. వెల్లంపల్లి ఇవాళ రామతీర్థం ఎందుకు వెళ్తున్నారు?  టీడీపీ కార్యకర్తలు గుడిలో కొట్టిన కోబ్బరి చిప్పలు ఎరుకోవడానికి  వెళ్తున్నారా? వెల్లంపల్లి లాంటి చేతకాని వ్యక్తికి దేవాదాయశాఖ ఇచ్చినందుకు ఆ దేవుడు కూడా భాదపడుతున్నాడు. వెల్లంపల్లి దేవాదాయశాఖను తన సొంత ఆదాయశాఖగా మార్చుకున్నారు. దేవాలయ అభివృద్ధి, దేవాలయలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా మంత్రి పదవి అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు'' అని ఆరోపించారు.

''దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఎలా అరికట్టాలో ఆలోచించకుండా చంద్రబాబు నాయుడుని తిట్టడం సిగ్గుచేటు. ఘటన జరిగి ఇన్ని రోజులైతే వెల్లంపల్లికి రామతీర్థం వెళ్లడానికి ఇవాళ తీరిక దొరికిందా? విజయసాయిరెడ్డి వెళ్లిన తర్వాత దేవాదాయశాఖ మంత్రి వెల్లడం ఏంటి?  దేవాదాయశాఖ మంత్రి విజయసాయిరెడ్డా? లేక వెల్లంపల్లా?'' అని మంతెన ప్రశ్నించారు. 

click me!