టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా: హోం క్వారంటైన్‌

By narsimha lodeFirst Published Aug 28, 2020, 11:15 AM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శుక్రవారం నాడు కరోనా సోకింది. ఈ వవిషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. కరోనాను జయించి త్వరలోనే తిరిగి రాజకీయాల్లో పాల్గొంటానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.


అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శుక్రవారం నాడు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. కరోనాను జయించి త్వరలోనే తిరిగి రాజకీయాల్లో పాల్గొంటానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

also read:తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా: రుయాలో చేరిక

 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు  సూచించినట్టుగా ఆయన చెప్పారు. తనను కలిసిన వారు కూడ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు. కరోనా నుండి కోలుకొంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కూడ కరోనా సోకింది. కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకుకు కూడ కరోనా సోకింది. 

 

నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను.

— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna)

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఏపీ మంత్రి బాలినేని ఈ నెల 6వ తేదీన అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ కూడ  కరోనా బారినపడిన విషయం తెలిసిందే....  ...
 

click me!