ప్రేమ పేరిట బాలికపై అత్యాచారం

Published : Aug 28, 2020, 10:46 AM IST
ప్రేమ పేరిట బాలికపై అత్యాచారం

సారాంశం

రాము సదరు బాలికను తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికను శెట్టూరు చెరుకు కట్ట సమీపంలోని తాతయ్య గుడి వద్దకు రప్పించాడు.

ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. కాదంటే చచ్చిపోతానన్నాడు. దీంతో.. అతనిది నిజమైన ప్రేమ అని బాలిక నమ్మేసింది. ఆమె నమ్మకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా శెట్టూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి వద్ద ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రాము ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. కాదంటే.. చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో.. నిజమేనని నమ్మి ఆ బాలిక అతని మోసానికి బలైంది. పథకం ప్రకారం గురువారం రాము సదరు బాలికను తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికను శెట్టూరు చెరుకు కట్ట సమీపంలోని తాతయ్య గుడి వద్దకు రప్పించాడు.

అక్కడి నుంచి టాటాఏస్ వాహనంలో కళ్యాణదుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి టాటాఏస్ వాహనంలో కళ్యాణ దుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు తీసుకువెళ్లాడు. ఆలయ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం బాలికను కళ్యాణ దుర్గం బైపాస్ లో బళ్లారి రోడ్డు మిట్టపై వదిలేశాడు. విషయం బాలిక తండ్రికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై శివ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu