బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ అంత ఈజీ కాదది: విజయసాయికి బుద్దా స్ట్రాంగ్ కౌంటర్

Arun Kumar P   | Asianet News
Published : Jul 16, 2020, 06:29 PM ISTUpdated : Jul 16, 2020, 06:38 PM IST
బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ అంత ఈజీ కాదది: విజయసాయికి బుద్దా స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్  చేశారంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు.

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్  చేశారంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికన విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 ''యుశ్రారైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్! అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్వీట్ చేసిన సాయిరెడ్డి గారికి దమ్ముంటే అమరావతిలో చంద్రబాబు గారు కట్టిన భవనం పైనుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలి. మూడు ముక్కలాట మొదలెట్టి ఒక్క ఇటుక పెట్టలేదు. మీరా విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది!'' అంటూ వెంకన్న ఎద్దేవా చేశారు. 

''బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత వీజీ కాదు రాజధాని నిర్మాణం అంటే సాయిరెడ్డి సాబ్. ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తా'' అంటే ట్విట్టర్ వేదికన సెటైర్లు వేశారు.

read more   ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా, టీడీపీ లేకుండా చేస్తా: మంత్రి బాలినేని సంచలనం

''అబబ్బె అదంతా గ్రాఫిక్స్ అల్లుడూ!'' అంటూ జగన్, విజయసాయి రెడ్డిలకు సంబంధించిన ఓ ఫోటోను కూడా వెంకన్న పోస్ట్ చేశారు. అమరావతిలో బిల్డింగ్స్ అన్నీ గ్రాఫిక్స్ అని విజయసాయి చెబుతుంటే... ఆ బిల్డింగ్స్ పై దూకి దాన్ని నిరూపించమని...అయితే బాత్రూం అవసరం వుండదు కదా అని సీఎం జగన్ అంటున్నట్లుగా ఓ ఫోటోను ట్విట్టర్ లో పెట్టారు వెంకన్న. 

అంతేకాకుండా ఇవాళ తమిళనాడులో పట్టుబడిన డబ్బుల గురించి కూడా వెంకన్న స్పందించారు. ''జగన్ గారి సాండ్,ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు.ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది'' అంటూ మరో ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu