కరోనా వ్యాక్సిన్ మీద సినీ హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Published : Nov 16, 2020, 11:49 AM ISTUpdated : Nov 16, 2020, 11:50 AM IST
కరోనా వ్యాక్సిన్ మీద సినీ హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కరోనా వ్యాక్సిన్ మీద నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సముద్రం నుంచి కృష్ణుడిని తీసి ద్వారక నిర్మిస్తారని కూడా హీరో బాలకృష్ణ అన్నారు.

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ మీద సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తిక సోమవారం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రాలేదని, కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. 

కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని, ఇక ముందు కూడా కరోనా వ్యాక్సిన్ రాదని ఆయన అన్నారు. కరోనా జీవితాంతం మన వెంటే ఉండే అవకాశం ఉందని, అది మన జీవితంలో భాగమవుతుందని తాను అనుకుంటున్నానని బాలకృష్ణ అన్నారు. 

మానసిక క్షోభ లేనప్పుడు అందరూ సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు. దేవుడిని నమ్మాలని ఆయన అన్నారు. అందరూ మంత్రాలు చదవాలని ఆయన అన్నారు. పెద్దలందరూ అదే విషయం చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. బిజెపి అయోధ్యలో రామాలయం నిర్మిస్తోందని, ఇక సముద్రం నుంచి కృష్ణుడిని తీసి ద్వారక నిర్మిస్తారని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu