అన్ని రాష్ట్రాలది ఒకదారయితే జగన్ ది మరోదారి..: టిడిపి ఎమ్మెల్యే నిమ్మల సెటైర్లు

By Arun Kumar PFirst Published Apr 25, 2021, 2:19 PM IST
Highlights

 దాదాపు పది రాష్ట్రాలు పది, ఇంటర్ తో పాటు ఆ పైతరగతుల పరీక్షలను వాయిదావేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, విద్యాశాఖ మంత్రి సురేష్ మూర్ఖంగా ముందుకు పోతున్నారని రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

అమరావతి: దేశంలోని అన్ని రాష్ట్రాలది ఒకదారయితే తనది మాత్రం మరోదారి అన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరతాం అంటూ మూర్ఖపు ముఖ్యమంత్రి వారి జీవితాలను విషమపరీక్షగా మార్చాడన్నారు. దాదాపు పది రాష్ట్రాలు పది, ఇంటర్ తో పాటు ఆ పైతరగతుల పరీక్షలను వాయిదావేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మూర్ఖంగా ముందుకు పోతున్నారని రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

''పరీక్షల నిర్వహిస్తే 15లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందితో కలిపి దాదాపు 90లక్షల కుటుంబాలు వైరస్ బారిన పడే ప్రమాదముంది. ఈ విషయం గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ మనస్తత్వంతో, మొండిపట్టుదలతో పరీక్షలు పెడతానంటే ఎలా?'' అని రామానాయుడు ప్రశ్నించారు.

read more  పల్లా ఆస్తుల ధ్వంసం.. జగన్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే: చంద్రబాబు

''విద్యా సంవత్సరం కుదించడంతో అటు పాఠ్యాంశాలు పూర్తిగాక, ఇటు పరీక్షల్లో ఏ ప్రశ్నలొస్తాయో తెలియక విద్యార్థినీ విద్యార్థులు అయోమయంతో ఉన్నారు. పరీక్షలు పెట్టి, విద్యార్థులు కరోనాకు గురైతే పిల్లలే ప్రాణంగా బతికే తల్లిదండ్రులకు  ఈ మొండి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? నారా లోకేశ్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేసైనా సరే పరీక్షలను టీడీపీ అడ్డుకొని తీరుతుంది'' అని స్పష్టం చేశారు. 

''ప్రజలు జగన్మోహన్  రెడ్డికి 151 సీట్లు ఇచ్చింది పల్లా శ్రీనివాసరావు భవనాన్ని కూల్చడానికి కాదు. నోటీసులు, ముందస్తు సమాచారాలు లేకుండా అర్థరాత్రి, తెల్లవారుజామునే ప్రతిపక్షనేతల నిర్మాణాలు ఎందుకు కూల్చేస్తున్నాడో ముఖ్యమంత్రి చెప్పాలి'' అని ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. 
 

click me!