ఉరితాడుతో, నిలువ కాళ్ల మీద నిలబడ్డ ఎమ్మెల్యే రామానాయుడు.. ఎందుకంటే...

Published : Jun 25, 2021, 11:45 AM IST
ఉరితాడుతో, నిలువ కాళ్ల మీద నిలబడ్డ ఎమ్మెల్యే రామానాయుడు.. ఎందుకంటే...

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు వినూత్న నిరసన చేపట్టారు. రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికోసం పాలకొల్లు వ్యవసాయ కార్యాలయం వద్ద ఉరితాడుతో నిలువ కాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే, వారికి ఉరే గతి అన్నారు. గత పంటకు సంబంధించి రైతుల ధాన్యం సొమ్ము రూ.4వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

పంట పండించడం కంటే అమ్ముకోవడం కష్టంగా ఉందన్నారు. రైతు ప్రభుత్వం అంటూ రంగుల ప్రకటనలు చేయడం కాదని, ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అరకొర ఇన్ పుట్ సబ్సిడీ, కట్టని ఇన్సూరెన్స్ తో సీఎం జగన్ రైతులను ఇన్సూరెన్స్‌తో సీఎం జగన్ రైతులను నట్టేట ముంచారని రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?