పదో తరగతి పాసవ్వని మంత్రి... పరీక్షల గురించి మాట్లాడటమా..: టిడిపి ఎమ్మెల్యే ఎద్దేవా

By Arun Kumar PFirst Published Jun 13, 2021, 11:31 AM IST
Highlights

కరోనా సమయంలో విద్యార్థులకు పరీక్షలు పెట్టాలన్న అనాలోచిత చర్యలతో విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే మంతెన సత్యనారాయణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. 

అమరావతి: ఓ వైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు రద్దు చేయాలంటుంటే మరో వైపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటున్నారని టిడిపి ఎమ్మెల్యే మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఈ అనాలోచిత చర్యలతో విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. '10వ తరగతి పాసవ్వని మంత్రులు కూడా పదవ తరగతి పరీక్షలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని ఎద్దేవా చేశారు. 

''కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సిబిఎస్ పది, 12 తరగతుల పరీక్షలను రద్దుచేసింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు పరీక్షలు రద్దుచేశాయి. కోవిడ్ ప్రభావం కారణంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు 500మందిపైగా ఉపాధ్యాయులు, మృత్యువాతపడ్డారు. దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఓవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి  పరీక్షలు నిర్వహించడం అవసరమా?  రద్దు చేస్తారా,లేక విద్యార్థులనే పరీక్షలు బహిష్కరించమంటారా?" అని నిలదీశారు.

read more  టైం టేబుల్ తో సిద్దంగా వుండండి...: పది, ఇంటర్ పరీక్షలపై అధికారులకు మంత్రి సురేష్ ఆదేశాలు

''కోవిడ్ ప్రబలుతోందని లండన్ లో ఉన్న మీ పిల్లలను ఇంటికి తీసుకువచ్చారు, రాష్ట్రంలోని విద్యార్థులు మీ పిల్లల వంటి వారు కాదా? విద్యార్థులు పరీక్షల కోసం రోడ్లపైకి వస్తే ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వైరస్ పెద్దఎత్తున మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పది, ఇంటర్  విద్యార్థులు 18లక్షలమంధికి పైగా ఉన్నారు. పరీక్షలు నిర్వహించినట్లయితే సుమారు కోటిమందికపైగా  కోవిడ్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.  ముఖ్యమంత్రి మూర్కత్వం వీడి విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించాలి.  తక్షణమే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలి'' అని మంతెన డిమాండ్ చేశారు.  

 

click me!