బీసీని కాబట్టే మంత్రి పదవి ఇవ్వలేదు

Published : Apr 02, 2017, 02:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బీసీని కాబట్టే మంత్రి పదవి ఇవ్వలేదు

సారాంశం

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు విమర్శలు  

బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

 

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పార్టీ మారిన వారికి, అగ్రకుల నాయకులకే పెద్ద పీఠ వేశారని విమర్శించారు.

 

గౌడ కులంలో పుట్టినందుకే తన మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
 


కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరపేటలోని తన నివాసంలో మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశమై తనకు జరిగిన అన్యాయంపై చర్చించారు.

 

పార్టీ లో బీసీ నాయకుడిగా ఉన్న  తనను ఇంతగా అవమానిస్తారని అనకోలేదని, టీడీపీలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.


ఆయనకు మద్దతుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

 

కాగా, రేపు పెడన బంద్ కు కాగిత వెంకట్రావు మద్దతుదారులు పిలునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?